AP: రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై రెండోరోజు ACB దాడులు కొనసాగాయి. తనిఖీల్లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, అక్రమాలు బయటపడ్డాయి. రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం, కారణం లేకుండా బిల్డింగ్ ప్లాన్లను హోల్డ్‌లో పెట్టడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ACB సిద్ధమవుతోంది.