AP: ఈనెల 9 నుంచి నెల్లూరు జిల్లాలో మహిళా జన్ సున్వాయ్ ప్రారంభించామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. ఈనెల 13వ తేదీ లోపు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. బాధితులు సంతృప్తి చెందకుంటే విచారించిన వారి స్థానంలో మరో అధికారిని నియమించాలని జిల్లా SPలకు సూచించినట్లు చెప్పారు.