W.G: ఆకివీడు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ వెల్లడించారు. బుధవారం ఉదయం పలు వార్డుల్లో పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయిలో కార్మికుల పనితీరును స్వయంగా పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించి, చెత్తకుప్పలను వెంటనే ట్రాక్టర్ల ద్వారా తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.