W.G: ఫోన్ ద్వారా వివాహితను అసభ్య పదజాలంతో దూషిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. నరసాపురం టౌన్‌లోని ఓ వివాహితను ఏడాదిగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్సై ఎస్.ముత్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.