KNR: శంకరపట్నం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రాచర్ల మల్లేశం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి కార్మికులను మోసం చేసిందని మండిపడ్డారు.