MDK: రామాయంపేట మండలంలో తెలంగాణ క్రీడా పాఠశాల ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షలు నిర్వహిస్తామని ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పది మంది బాలురు, పది మంది బాలికలను ఎంపిక చేసేందుకు వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.