NGKL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరగనున్న జాతీయ సదస్సుకు నల్లమల ప్రాంత మహిళా సర్పంచ్ బొజ్జ గీతారెడ్డి ఎంపికయ్యారు. ఈ నెల 11న జరిగే ఈ సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 16 మంది మహిళా సర్పంచులలో గీతారెడ్డి ఒకరు కావడం విశేషం.