PPM: పట్టణంలోని పార్కుల అభివృద్ధి, నిర్వహణపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పార్వతీపురం పురపాలిక కమిషనర్ జీ. శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఓ పత్రికలో వచ్చిన వార్తపై మంగళవారం ఆయన పై విధంగా స్పందించారు. సౌందర్య థియేటర్ వెనుకభాగంలో ఉన్న పార్కులో నడకదారి ట్రాక్ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు.