Shocking: రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు
రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.
సమాజంలో నేడు బంధాలకు సరైన స్థానం లేకుండా పోతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి గురై మనుషుల ప్రవర్తనా తీరు అనేక దారుణాలకు కారణమవుతోంది. ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో ఊహించలేం. చిన్న చిన్న విషయాలకే కోపాలు రావడం, ఆ కోపంలో మన అనుకున్నవాళ్లనే హత్యలు చేసే పరిస్థితికి వెళ్లడం అధికమవుతోంది. ఇలాంటి దారుణాలు ప్రతిరోజూ ఎక్కడోకచోట జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ విలువలు పాతాళానికి పడిపోయి ఆవేశంలో చేయకూడని పనులు చేస్తున్నారు.
తాజాగా ఓ రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. రామకుప్పం మండంలోని చింతకుప్ప గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి తన కొడుకు నితీష్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నితీష్ కూలిపనులకు వెళ్తుంటాడు. రోజూలాగే ఆ రోజు కూడా కూలి పనికి వెళ్లాడు. కానీ అతని యజమాని తనకు ఇవ్వాల్సిన కూలిడబ్బులు నితీష్ తండ్రి సుబ్రమణ్యంకు ఇచ్చాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.
తండ్రీకొడుకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన కొడుకు నితీష్ తన తండ్రి సుబ్రమణ్యంతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలోనే ఆ తండ్రి కొడుకుపై చేయిచేసుకున్నాడు. సహించని నితీష్ తన తండ్రిని అక్కడే ఉన్న చెక్కతో తలపై బలంగా బాదాడు. సుబ్రమణ్యానికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు రామకుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే సుబ్రమణ్యం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.