KMR: సంగోజివాడి గ్రామంలో సీఎం, ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు మంగళవారం మహిళలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.