VKB: తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనన్యతో కలిసి మంగళవారం షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. సాయిబాబాను కొలిస్తే అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు.