AKP: రేగుపాలెం హైవే జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న లారీ, రోడ్డు పక్కన పల్సర్ బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి లారీ వెనుక చక్రాల కింద పడి నుజ్జయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.