BPT: బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామంలో చోటుచేసుకున్న భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన సంతమాగుళూరు సీఐ కె. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడు గుంటుపల్లి వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.