AP: విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు భూమిపూజ చేశారు. మరోవైపు వెయ్యి సీటింగ్ కెపాసిటీతో ఉన్న కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్లో శనివారం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.