VZM: పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పాడి రైతులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు వేపాడ వెటర్నరీ డాక్టర్ గాయత్రీ ఇవాళ తెలిపారు. ఇప్పటివరకు మండలంలో వీలుపర్తి, డీబీ పేట, బానాది, వల్లంపూడి గ్రామాల్లో రైతులకు రూ.1,30,000 రుణాలను వేపాడ ఏపీజీవీబీ బ్యాంకు మంజూరు చేసినట్లు తెలిపారు. పాడి పశువుల పోషణకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.