AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొందరు తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.