HYD: సికింద్రాబాద్ కేంద్రంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరోగసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.