ASF: కౌటాల మండలం తుమ్మిడిహేట్టిలో ఈ నెల 16న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గ్రామ కమిటీ సభ్యులు మహారాష్ట్రలోని రాజురా మున్సిపల్ ఛైర్మన్ అరుణ్ బావుకు అందజేసి ఆహ్వానించారు. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.