WGL: రాయపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ గారే మహేంద్ర బిక్షపతి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేరి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం అని, వాటిని కొనసాగించేలా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పూలే చేసిన పోరాటాలను గుర్తు చేశారు.