NLG: కట్టంగూర్ మండల పరిధిలో గురువారం జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు బుధవారం తెలిపారు. మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయితీలలో మల్లారం, దుగినవెల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 20 గ్రామ పంచాయితీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.