HYD: దోమలగూడ SI విజయ బృందం రైడ్స్లో 4,208 కిలోల PDS బియ్యం పట్టుబడింది. కాచిగూడకు చెందిన MD అహ్మద్ అరెస్ట్ అయ్యాడు. బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్లకు అక్రమంగా తరలించే ప్రయత్నం జరిగినట్టు విచారణలో బయటపడింది. కేసు నమోదు చేసి ఇతరుల ప్రమేయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రజా సరుకుల దుర్వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.