VZM: గంట్యాడ మండలం రామవరంలో జరిగిన సెల్ఫ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి సత్వరం స్పందించి ఆసుపత్రికి తరలించారు. రామవరం ప్రాంతం వెళ్తున్న ఆయన రోడ్డు ప్రమాదంలో రక్తస్రావం జరుగుతున్న వ్యక్తిని గమనించారు. వెంటనే వాహనం ఆపి సపర్యలు చేసి, నీరు అందించి, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.