SKLM: పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తత, సమన్వయం ఎంతో కీలకమని జిల్లా పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్ అన్నారు. శనివారం పైడి భీమవరం సరగడపేటలో పరిశ్రమల్లో విషవాయువు లీకేజీ అయినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో అనే దాని పై మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాము, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు ఉన్నారు.