TG: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం జిల్లెల గ్రామం వద్ద పోలీసులు చేస్తున్న వాహన తనిఖీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిరిసిల్లకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్తుండగా.. ఆయన వాహనాన్ని జిల్లెల గ్రామం వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనాన్ని పరిశీలించి సోదాలు చేశారు. ఈ మేరకు తనిఖీలకు సహకరించినందుకు KTRకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.