MNCL: సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న పోలింగ్లో అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత ఎన్నికలలో 85.26 శాతం ఓటింగ్ నమోదైందని, ఈసారి 90 శాతం నమోదు జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.