VZM: ఎస్‌కోట మండలం పెద ఖండేపల్లిలో ఇటీవల ఆధునీకరించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు బుధవారం ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.