SKLM: మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ స్పందించారు. తన కార్యాలయం నుండి ఉద్యానవన శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు, ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను వెంటనే అందించాలని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.