దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’. AR సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు అప్డేట్స్ ఇచ్చారు. రేపు ఈ మూవీ టీజర్ రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 23న ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.