SRD: కంగ్టి మండలం గాజులపాడ్ క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. సమస్యాత్మక గ్రామమైన గాజులపాడు గ్రామ రాజకీయ పరిస్థితులపై పరిశీలించారు. ఈ మేరకు నామినేషన్ వేయడానికి వచ్చిన స్థానిక అభ్యర్థులతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన, నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. SI దుర్గా రెడ్డి ASI రవి గౌడ్ ఉన్నారు.