మనలో చాలా మంది బాత్రూమ్ ని ఓ స్టారో రూమ్ లా చూస్తారు. పనికి వచ్చేవి, పనికిరానివి ఇలా అన్నింటినీ బాత్రూమ్ లో పెట్టేస్తూ ఉంటారు. టూత్ బ్రష్ దగ్గర నుంచి టవల్ ఇలా చాలా వాటిని ఉంచుతారు. కానీ నిజానికి వాటన్నింటినీ బాత్రూమ్ లో ఉంచొచ్చా..? అసలు బాత్రూమ్ లో ఉంచకూడదని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
మీ ప్రస్తుత రేజర్‌లో ఉన్న బ్లేడ్స్ వరకు , లేకపోతే, మీ స్పేర్ బ్లేడ్లను బాత్రూమ్లో ఉంచవద్దు. తేమ వాటిని తుప్పు పట్టేలా లేదా నిస్తేజంగా ఉండేలా చేయవచ్చు. మేకప్ వస్తువులు ఏవీ బాత్రూమ్ లో స్టోర్ చేయకూడదు. మేకప్ వేసుకునే బ్రష్ లతో సహా వీటిని బాత్రూమ్ లో స్టోర్ చేయకూడదు. బాత్రూమ్ లో క్రిములు, కీటకాలు వాట ద్వారా మీ ముఖానికి చేరి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.
మందులను సైతం బాత్రూమ్ లో స్టోర్ చేయకూడదు. అసలు తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాటిని స్టోర్ చేయకూడదు. దాని వల్ల మందులు దాని శక్తిని కోల్పోతాయి. ప్రతిఒక్కరూ టూత్‌బ్రష్‌లను బాత్రూంలోనే పెట్టుకుంటారు. బాత్రూమ్లో పెట్టిన బ్రష్‌ను వాడడంతో అనారోగ్యానికి గురవుతారు. టూత్‌బ్రష్ కవర్ వాడడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుంది. చాలా మంది స్నానం చేసే సమయంలో జ్యూయలరీ తీసి బాత్రూమ్ లో పెట్టి మర్చిపోతూ ఉంటారు. కానీ పొరపాటున కూడా బాత్రూమ్ లో జ్యూయలరీ ఉంచకూడదు. దాని వల్ల అవి కళ తప్పిపోయే అవకాశం ఉంది.