JGL: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లీం మహిళలకు మంత్రి ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్ద పీట వేసి, అధిక నిధులు మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.