Men’s Fertility: సంతానం కలగకపోవడాన్ని ఒకప్పుడు మహిళల తప్పుగా భావించేవారు. వారిలో ఉండే లోపం కారణంగానే సంతానం కలగడం లేదని అని విశ్వసించేవారు. టెక్నాలజీ మారిన తర్వాత అసలు విషయం తెలిసింది. పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఫెర్టిలిటీ సమస్యలు స్త్రీలలో ఎంత ఉంటున్నాయో పురుషుల్లో కూడా ఆ స్థాయిలో ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి పురుషులు బయటపడే మార్గమే లేదా అంటే ఉంది. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ చూపించి, లైఫ్ స్టైల్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
వీర్య కణాల సంఖ్య పెరగడానికి చేయాల్సినవి ఇవే
ఎక్కువ పండ్లు, కూరగాయలు తినండి- పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, చిక్కుళ్ళు వంటి వాటిని ఆహారంలో చేర్చడం వలన స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా పెరుగుతుంది.
చేపలను ఎక్కువగా తీసుకొండి: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అధిక సాంద్రతతో, చేపల వినియోగం మెరుగైన స్పెర్మ్ చలనశీలతకు దారితీస్తుంది.
కార్బోహైడ్రేట్లను తక్కువగా ఉంచండి: తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో, టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.
జింక్ తీసుకోవడం పెంచండి: టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యానికి జింక్ అవసరం కాబట్టి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి జింక్ కీలకం. గుల్లలు, చికెన్, బచ్చలికూర, గుమ్మడికాయ గింజలు, కాయధాన్యాలు వంటి ఆహారాల్లో జింక్ పుష్కలంగా ఉంటాయి.
అస్సలు చేయకూడనివి ఏంటో ఓసారి చూద్దాం
ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి: ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికం. రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, కృత్రిమ బంక పదార్థాలు వంటివి ఉంటాయి. ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి. వీర్య కణాల్లో కదలికను తగ్గిస్తాయి. అందువల్ల పోషకాలు అధికంగా ఉంటే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
పురుషులు మాంసం, అధిక కొవ్వులు ఉన్న డెయిరీ ఉత్పత్తులు ముఖ్యంగా వెన్న తీయని పాలు, క్రీమ్, చీస్ తగ్గించాలి. సోయా ఉత్పత్తుల్లో ఫైటో ఈస్ట్రోజెన్లు ఉన్నందున వాటిని కూడా తగ్గించాలి.
పొగ తాగరాదు: పొగ తాగడం, పొగాకు వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.