SKLM: అధునాతన పద్ధతిలో రైతులు సేద్యం చేయాలని కోటబొమ్మళి MPDO కుప్పిలి ఫణీంద్ర కుమార్ అన్నారు. స్థానిక మండలం బడ్డిపేట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం గురువారం నిర్వహించారు. రైతులుకు ప్రభుత్వం ఎన్నో సబ్సిడీ పథకాలను మంజూరు చేస్తున్నారని వాటిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలను రైతులు పండించాలన్నారు.