పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించకుండా పార్లమెంట్‌కు బీజేపీ తాళం వేసిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. మన విదేశాంగ శాఖ డొనాల్డ్ ట్రంప్‌కు లొంగిపోయిందని విమర్శించారు. భారత విదేశాంగ విధానం వల్ల దేశ ఆర్థిక స్థిరత్వం, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఇండియన్ల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.