VSP: విశాఖపట్నం- విజయనగరం జాతీయ రహదారిలో ఐటీ రోడ్డుకు ముఖద్వారమైన కార్ షెడ్ ప్రాంతంను నిత్యం ట్రాఫిక్ రద్దీ వెంటాడుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య తీరడం లేదు. ఎండాడ, ఆదర్శనగర్, హనుమంతవాకల వద్ద ఇదే పరిస్థితి ఉండటంతో రాకపోకలు సాగించే వారంతా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.