KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు సీఐఎస్ఎఫ్ డీఐజీ రాఘవేంద్ర కుమార్ కుటుంబ సమేతంగా వచ్చారు. వారికి శ్రీ మఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవికి కుంకుమార్చన చేసి, మంగళహారతులు ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.