కృష్ణా: ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నమ్మ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాగా కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.