E.G: కడియం మండలం మురమండ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన రాజాన మాలునాయుడు, దేవి దంపతులతో పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 15 అడుగుల ఎత్తు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.