WGL: సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా గీసుగొండ మండలంలోని ఊకల్ ప్రాంతంలో గల శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో KTR ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక BRS నేతలు, అర్చకులు కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు.