E.G: రైతులు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నాణ్యమైన, అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. మంగళవారం కడియం మండలం మాధవరాయుడుపాలెంలో జరిగిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. రైతులు సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.