RR: శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వడ్డీ లేని రుణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.