KMR: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.