VKB: గర్భిణీ స్త్రీలు మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు. కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30మంది గర్భిణీ స్త్రీలు అటెనల్ చెకప్స్ చేశారు. మంచి పోషక విలువలు ఉన్నటువంటి క్యారెట్, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు ఆకుకూరలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా బిడ్డ మంచిగా, ఆరోగ్యంగా పెరగడం జరుగుతుందన్నారు.