BDK: మణుగూరు ప్రధాన రహదారి నుంచి BTPS వరకు గుంటలు పడ్డ రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నేడు రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. సమస్యలు త్వరగా పరిష్కారం కానీ పక్షంలో బీ. ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు తెలిపారు.