సత్యసాయి: శ్రీలంకలో జరిగిన మొదటి మహిళా అంధుల టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ను ఓడించి విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిప్పేస్వామి అభినందనలు తెలిపారు. అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.