Minister Roja: ఆ భూమిలో చంద్రబాబుని పాతి పెట్టాలి!
పేదలకు భూ పంపిణీ చేస్తుంటే, సమాధులకోసమా అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నాడని, ఆ దిగజారుడు మాటలు మాట్లాడే టీడీపీ నేతలను అదే భూమిలో పాతిపెట్టాలని మంత్రి రోజా మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఈ రోజు జగన్ ప్రజలకు భూమి పంపిణీ చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు భూ పంపిణీ చేస్తుంటే, సమాధులకోసమా అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నాడని, ఆ దిగజారుడు మాటలు మాట్లాడే టీడీపీ నేతలను అదే భూమిలో పాతిపెట్టాలని ఆమె మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలు ఓట్లు వేయడానికి తప్ప దేనీకి పనికిరారా అని ఆమె ప్రశ్నించారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టీడీపీని ప్రజలు పూడ్చేస్తారని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు తమనే అని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు.