Ramdev Baba: రెజ్లర్లకు యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) మద్దతు ప్రకటించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను (Brij Bhusan) అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనను కొనసాగిస్తున్నారు.
‘బ్రిజ్ భూషణ్ (Brij Bhusan) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గుచేటు. వేధించేవారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అతను మహిళల గురించి చులకనగా మాట్లాడుతున్నాడు అని’ రామ్ దేవ్ బాబా (Ramdev Baba) అన్నారు. బ్రిజ్ భూషణ్‌పై (Brij Bhusan) ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అరెస్ట్ చేయలేదని మీడియా ప్రతినిధులు అడిగారు. ఏదైనా అంశం గురించి తాను మాట్లాడగలనని.. అతనిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) చెప్పారు. ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పగలను. దేశంపై తనకో విజన్ ఉందని.. పొలిటికల్‌గా ప్రకటన చేస్తే ఎన్నో మలుపులు తిరుగుతాయని రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) అన్నారు.
బ్రిజ్ భూషణ్ (Brij Bhusan) ఎంపీ అనే సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆయన హాజరైతే దేశంలో నెలకొన్న సిచుయేషన్ జనాలను తెలుస్తోందని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కు ఎవరూ సపోర్ట్ చేసినా తమకు వ్యతిరేకమే అన్నారు. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తమకు తెలియదని.. కొందరు మాత్రం రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. బ్రిజ్ మాత్రం దేశంలోని ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నారని వినేశ్ ఫొగాట్ మండిపడ్డారు.