AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్షసూచన చేసింది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని చెప్పింది.