VZM: ప్రజావాణిని నిర్భయంగా వెలుగెత్తి చాటే పవిత్రమైన వృత్తి పాత్రికేయానిదేనని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనమహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కటి పాటను రచించిన కమిషనర్ పల్లి నల్లనయ్య పాత్రికేయులకు అంకితం చేశారు. సమాచార శాఖ ఎడీ. గోవిందరావు పాల్గొన్నారు.