కాకినాడ ట్రాఫిక్ 1, 2 పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 70 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ తెలిపారు. వీరిని సోమవారం మేజిస్ట్రేట్ చింతా నాగేంద్రరావు ముందు హాజరుపరిచారు. కోర్టు 22 మందికి జైలు శిక్ష, 48 మందికి ఒక్కొక్కరికి 10 వేల జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.